- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంట్లోకి దూసుకెళ్లిన వోల్వో బస్సు..
<p>దిశ, వెబ్డెస్క్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులతో వెళుతున్న వోల్వో బస్సు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఒరిస్సా నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, ఆ సమయంలో ఇంట్లో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.కాగా, […]</p>

X
దిశ, వెబ్డెస్క్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులతో వెళుతున్న వోల్వో బస్సు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఒరిస్సా నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.
దీంతో రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, ఆ సమయంలో ఇంట్లో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.కాగా, ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 ప్రయాణికులు ఉండగా, ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






