విషాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

by srinivas |
విషాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొన్నది. రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా శాంతిపురం దండికుప్పం వద్ద ఇద్దరు యువకులు వెళ్తున్న బైక్ ను ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలిసి యువకుల కుటుంబ సభ్యులు, బంధవులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story