మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు దుర్మరణం

by Anukaran |
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతిచెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లిలో మంగళవారం తెల్లవారు జామున రోడ్డుప్రమాదం జరిగింది. బైక్-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story