వేములవాడలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

by Sridhar Babu |

దిశ, కరీంనగర్: ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి సిరిసిల్ల జిల్లా అధికారులకు సమాచారం అందింది. వేములవాడ పట్టణానికి చెందిన నలుగురిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. మొదటి వ్యక్తికి మూడు వారాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, మరో ఇద్దరికి నాలుగు వారాలకు నిర్ధారణ అయింది. జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ కోరారు. మే 3 వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. అనవసరంగా బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags: corona virus,vemulawada,Markaz,lock down

Next Story