సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు..!

by Shyam |   ( Updated:2020-11-01 02:10:07.0  )
సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అక్టోబర్ 12: బాన్సువాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చామంతుల టాటా బాబు తన నివాసంలో కాం ట్రాక్టర్ మెగావత్ ప్రతాప్ సింగ్ నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సర్కిల్ పరిధి నసురుల్లాబాద్ పోలీస్స్టేషన్ లో సెక్షన్41 (ఏ) సీఆర్ పీసీ కింద నమోదైన ఓ కేసు లో వేధించకుండా ఉండడానికి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. తొలుత రూ. 20 వేలు తీసుకుని, రెంటడో సారి రూ. 10 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు.

అక్టోబర్ 31 : బోధన్ పోలీస్స్టేషన్ పరిధి పట్టణంలోని ఓ భూమి కొనుగోలు విషయంలో రియల్టర్ సా జిద్ అహ్మద్, మరో వ్యక్తి గొడవ పడ్డారు. అది సీసీ కెమెరాల్లో సైతం రికార్డు అయ్యింది. నెలరోజులుగా బా ధితుడు సాజిద్ అహ్మద్ వాహనాన్ని పోలీ సులు స్టేషన్ లోనే ఉంచుకున్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేయ కుండా, వాహనాన్ని తిరిగి ఇ వ్వాలంటే రూ.50 వేలు, రూ. లక్ష విలువైన ఫోన్ఇ వ్వాలని డిమాండ్ చేశారు. శనివారం స్టేషన్లో తీసు కుంటుండగా సీఐ రాకేశ్, డ్రైవర్ గజేందర్ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ కేసులో సీఐ, అతడి డ్రైవర్, ఎస్సై మొగులయ్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

‘ఇక్కడ సివిల్ పంచాయితీలు పరిష్కరించబడవు’ అని తాటికాయంత అక్షరాలతో ప్రతి పోలీస్స్టేషన్గోడలపై రాసి ఉంటుంది. న్యాయస్థానాలు లేదా వ్యక్తిగతంగా (పరస్పర అంగీకారంతో) పరిష్కరించుకోవాలని దాని ఉద్దేశం. కానీ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని చాలా పోలీస్స్టేషన్లను అధికారులు సివిల్ పంచాయితీలకు అడ్డాలుగా మార్చారు. స్టేషన్‌ బెయిల్‌, ఎఫ్‌ఐఆర్లో పేరు తొలగింపు, కేసు నుంచి తప్పించేందుకు… ఇలా అదను దొరికితే చాలు ఇరువర్గాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఉమ్మడి జిల్లాలో రియల్ భూమ్ కారణంగా భూముల ధ రలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఏర్పడిన వివా దాల పరిష్కారానికి బాధితులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుండడంతో డబ్బు, సమయం వృథా అవుతున్నాయి. దీంతో వారు పోలీస్స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అద నుగా భావిస్తుస్తున్న ఎస్సై, సీఐ స్థాయి అధికారులు ఠా ణా లను సివిల్ పంచాయతీలకు అడ్డాలుగా మార్చుతున్నారు. దానికి తోడు సెక్షన్41 (ఏ) సీఆర్ పీసీ కింద పోలీస్స్టేషన్ల లో ఎస్ హెచ్ వోలు బెయిల్ఇచ్చే అధికారం కట్టబెట్టడాన్ని కొందరు ఆయుధంగా మార్చుకున్నారు. కేసుల నమోదు, బెయిల్ ఇవ్వడానికి బాధితులనే బెదిరిస్తున్నారు. కొందరు అధికారులు సిబ్బందితో సెటిల్ మెంట్లు చేస్తుంటే, మరికొందరు పెద్దమనుషులుగా చెలామణి అయ్యేవారి ద్వారా ఈ తతంగం నడపుతున్నారనే ఆరోపణలున్నాయి. మరికొందరైతే ఏకంగా బ్రోకర్ల ద్వారా దందా ను మూడు పూవులు, ఆరు కాయలుగా యథేచ్ఛగా నడిపిస్తున్నారు.

రియల్ భూమ్ ఉన్న ఏరియాల్లో పోలీస్స్టేషన్లు కొందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లకు కాసులు కురిపిస్తున్నాయి. నిజామాబాద్ నగర శివారు ప్రాంతాలు, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సు వాడ పోలీస్ఠాణాల పరిధిలో రియల్ వ్యాపారులు, దళారు లు పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కడం, దిగడం సర్వసాధారంగా మారింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎస్సై హైదరాబాద్లో జరిగిన రియల్ పంచాయితీలో గన్ తో కొంతమందిని బెదిరించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇద్దరు, ముగ్గురు అధికారుల వ్యవహార శైలి కూడా ఇటీవల వివాదాస్పదంగా మారింది. నిత్యం వారి వారి కార్యాలయాల్లో సివిల్ పంచాయతీలు, ల్యాండ్సెటిల్మెంట్లు చేయడమే పలు విమర్శలు ఉన్నాయి. దానికి తోడు వారి పేరు చెప్పి దళారులు వ సూళ్లకు కూడా పాల్పడుతున్నారని పోలీస్శాఖలో అంతా కోడై కూస్తోంది. పైరవీ కారులకు మర్యాదలు చేస్తూ వారితో సన్నిహితంగా ఉండడం ఆ శాఖలోనే చాలా మంది అధికారులు, సిబ్బందికి నచ్చలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ఆరోపణలున్నా ఏడాది కాలంలో ఏ ఒక్క ఎస్సై, సీఐ పై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed