- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాకు న్యాయం చేయండి.. మంత్రి సబితను కలిసిన 1998 డీఎస్సీ సాధన సమితి
దిశ, హైదరాబాద్ : డీఎస్సీ-98 క్వాలిఫైడ్స్ నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల అభ్యర్థులందరికీ త్వరగా ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేసేలా సీఎం కేసీఆర్‌తో మాట్లాడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె. శ్రీనివాస్ కోరారు. ఆదివారం ఉదయం ఆయన మంత్రి సబితను కలిసి వినతిపత్రం అందజేశారు.
4 జిల్లాలకు చెందిన పిటిషనర్లకు అనుకూలంగా కోర్టు తీర్పులు, సీఎం కేసీఆర్ జనవరి 3, 2016న ఇచ్చిన స్పష్టమైన హామీని పరిగణనలోకి తీసుకుని సీఎంతో మాట్లాడి త్వరగా న్యాయం చేయించాలని వారు అభ్యర్థించారు. డీఎస్సీ-98 క్వాలిఫైడ్స్ అధిక సంఖ్యలో తీవ్ర మానసిక సంఘర్షణతో చనిపోతున్నారని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదనను సానుకూలంగా విన్న మంత్రి సబిత.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి న్యాయం చేయిస్తానని హామీ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రిని కలిసిన వారిలో 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మట్టపల్లి ఉపేందర్, నల్లగొండ జిల్లా కన్వీనర్ బొడ్డు రమేష్, తదితరులు ఉన్నారు.