తొలిరోజు మెట్రోలో 19వేల మంది ప్రయాణం

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు పట్టాలపైకి వచ్చింది. కానీ నగర ప్రయాణికులు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. మొదటి రోజు 19వేల మంది మెట్రోలో రాకపోకలు సాగించారు. మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ మార్గంలో రైలు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు రైళ్ళు 120 ట్రిప్పులుగా రాకపోకలు సాగించాయి. మంగళవారం(8వ తేదీ) నుంచి నాగోల్ నుంచి రాయదుర్గం వరకు రైళ్ళు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మెట్రో రాకపోకలు సాగిస్తాయని, దీంతో రెండు కారిడార్లలో రైళ్ళు అందుబాటులోకి వచ్చినట్లుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Advertisement