19 మంది అరెస్ట్.. భారీగా వాహనాలు స్వాధీనం

by  |
19 మంది అరెస్ట్.. భారీగా వాహనాలు స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి జిల్లాలో కోడిపందాలాట ఆడుతూ పెద్ద సంఖ్యలో అరెస్ట్ అయ్యారు. వారి నుంచి భారీగా వాహనాలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ మండలం చిన్నపలుగు తండా గ్రామ శివారులో ఆదివారం రాత్రి కోడిపందాలాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 19 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి 19 కార్లు, 30 బైకులు, రూ. లక్షా 51 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.



Next Story