టీటీడీలో కరోనా @ 170

by srinivas |
టీటీడీలో కరోనా @ 170
X

దిశ ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానంపై కరోనా పంజా విసురుతోంది. తిరుమలలో రోజురోజుకు కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా శ్రీవారి ఆలయ జీయర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీక్షలో ఉన్న నేపథ్యంలో ఆయనకు మఠంలోనే వైద్య సదుపాయమందిస్తున్నారు. శిష్యులే ఆయనకు శుశృష చేస్తున్నారు. టీటీడీలో ఇప్పటి వరకు 170 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారని అధికారులు వెల్లడించారు. ఇందులో 18 మంది అర్చకులు, 100 మంది సెక్యురిటీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 20 మంది పోటు సిబ్బంది, కల్యాణకట్టలో ఇద్దరు ఉన్నట్టు వెల్లడించారు. దీంతో 60 ఏళ్లు నిండిన అర్చకులకు విధుల నుంచి సడలింపు ఇచ్చారు.

Next Story

Most Viewed