ఆల్మట్టి ప్రాజెక్టుకు 1,64,239 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

by Shyam |
ఆల్మట్టి ప్రాజెక్టుకు 1,64,239 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
X

దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా బేసిన్‌లో ఎగువ నుంచి వరదలు కొనసాగుతున్నా… దిగువకు నీటి విడుదల తగ్గించారు. ఎగువ ప్రాజెక్టులను పూర్తిగా నింపేందుకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు 1,64,239 క్యూసెక్కులు వస్తున్నా దిగువకు 39 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. 129 టీఎంసీల సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో మంగళవారం రాత్రి వరకు 110 టీఎంసీల నిల్వకు చేరింది. నారాయణపూర్ జలాశయానికి 40 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా 13,910 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదైంది. 37టీఎంసీల ఈ ప్రాజెక్టులో 34 టీఎంసీల నిల్వకు చేరింది. జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. మంగళవారం రాత్రి వరకు జూరాల ప్రాజెక్టుకు 1.35 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, దిగువకు 1,29,330 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు 1,47,890 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 40,259 క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 119 టీఎంసీల నిల్వ ఉంది. నాగార్జున సాగర్ జలాశయానికి 40 వేల క్యూసెక్కులు వస్తుండగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 5622 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు 236 టీఎంసీలకు చేరింది. మరోవైపు తుంగభద్ర జలాశయానికి వరద కొంత తగ్గింది. మంగళవారం రాత్రి వరకు 79 వేలక్యూసెక్కులు వస్తుండగా 9 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ఇక గోదావరి బేసిన్‌లోని శ్రీరాం సాగర్‌కు 14 వేలక్యూసెక్కులు వస్తున్నాయి. మిడ్ మానేరుకు 21వేల క్యూసెక్కులు వస్తున్నాయి. ఎల్లంపల్లికి 24వేల క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed