- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బ్లాక్’లో నటించేందుకు భయపడ్డా : రాణీ ముఖర్జీ
దిశ, సినిమా : సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘బ్లాక్’ రిలీజై 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. అమితాబ్ బచ్చన్, రాణీ ముఖర్జీ ప్రధానపాత్రల్లో కనిపించిన ఈ సినిమాలో వీరిద్దరూ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన కెరియర్‌లోనే ది బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చిన రాణీ ముఖర్జీ.. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీని షేర్ చేసింది. హిందీ చలనచిత్ర పరిశ్రమలోని అత్యత్తుమ పర్‌ఫార్మెన్స్‌లో చెవిటి, అంధ మహిళగా రాణీ ముఖర్జీ నటించిన ‘బ్లాక్’ ఒకటి కాగా.. అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఎంచుకుంది? అనే విషయాలను ఈ సీనియర్ హీరోయిన్ తాజాగా వెల్లడించింది.
బ్లాక్ చిత్రానికి గాను ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ ఫిమేల్, క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ ట్రోఫీ అందుకున్న రాణీ ముఖర్జీ.. దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ ఈ క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు అంత కాన్ఫిడెన్స్‌తో లేదట. కానీ దేవదాస్ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్‌కు ఫ్యాన్ అయిపోయిన తను, ఎలాగైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకుందట. కానీ మళ్లీ, ‘నిజంగా మీరు నేను ఇంతటి డిఫికల్ట్ క్యారెక్టర్‌ను హండ్రెడ్ పర్సెంట్ చేయగలనని నమ్ముతున్నారా?’ అని ప్రశ్నించగా.. డైరెక్టర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఓకే చెప్పేసిందట.
మొదట ఈ పాత్ర చేసేందుకు భయపడినా… డైరెక్టర్ తనపై ఉంచిన నమ్మకం, డైరెక్టర్‌పై తనకున్న నపమ్మకం ‘బ్లాక్’ సినిమా చేసేందుకు సహాయపడిందని తెలిపింది. అడుగడుగునా ఈ పాత్ర గురించి వివరించేవాడని, మిచెల్ మెక్‌నాలీ పాత్రను అధ్యయనం చేసేందుకు.. అంధులు, మూగవారు, వినికిడి లోపం ఉన్న వారిని కలిశానని చెప్పింది. సంజయ్ లీలా భన్సాలీ నిజంగా తన వాగ్ధానాన్ని నెరవేర్చాడని.. ఆరు నెలల పాటు సైన్ లాంగ్వేజ్ ట్రైనింగ్‌కు పంపించడంతో పాటు స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్‌తో మాట్లాడేదాన్నని తెలిపింది. ఆ విధంగా మిచెల్ పాత్రలోకి ప్రవేశించగలిగానని వివరించింది. తద్వారా విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు పొందిన తాను.. బ్లాక్‌లో తన నటనకు లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ నుంచి అప్రిసియేషన్ లెటర్ రావడం మరిచిపోలేనని తెలిపింది రాణీ ముఖర్జీ. ఇది గొప్ప పురస్కారం అందుకోవడంతో సమానమని చెప్పింది.