16 అడుగుల దూరంలోనూ సోకుతుంది

దిశ, వెబ్ డెస్క్: కరోనా(corona) రక్కసి దాటికి ప్రపంచ (world) విలవిలలాడుతోంది. రోజుకో కొత్త లక్షణాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు(cough), జ్వరం(fiver), జలుబు(cold) వంటి లక్షణాలతో వైరస్ ఉంటుందని చెప్పిన నిపుణులు మరికొన్ని రోజుల అనంతరం.. రుచి( taste) లేకపోవడం.. కళ్లు ఎర్రబడిపోవడం వంటివి వైరస్ లక్షణాలు అన్నారు. తాజాగా 16 అడుగుల దూరంలో ఉన్నా కరోనా సోకుతుందని ఫ్లోరిడా యూనివర్సిటీ(university of florida) వైరాలజీ నిపుణులు(virology specialists) చెబుతున్నారు.

యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా హెల్త్ షాండ్స్ ఆసుపత్రిలోని కొవిడ్‌-19 వార్డులో రోగులను ఏడు నుంచి 16 అడుగుల దూరంలో ఉంచి సేకరించిన ఏరోసోల్స్ (aerosols) లో కరోనా(corona) వైరస్ ఉందని స్పష్టం చేశారు. దీంతో సామాజిక దూర నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. గది లోపలి ఉష్ణోగత్రలో 16 అడుగుల దూరం వరకు గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని న్యూయార్క్ కొలంబియా విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్ ఏంజెలా రాస్ముసేన్ కూడా అన్నారు.

Advertisement