సెంట్ర‌ల్ కోల్డ్ ఫీల్డ్స్‌లో 1,565 అప్రెంటిస్‌లు..!

by  |
సెంట్ర‌ల్ కోల్డ్ ఫీల్డ్స్‌లో 1,565 అప్రెంటిస్‌లు..!
X

దిశ, వెబ్‎డెస్క్:

ప్ర‌భుత్వ‌ రంగ మినీ ర‌త్న కంపెనీ సెంట్ర‌ల్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్‌)లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి కోసం నోటిఫికేష‌న్ విడుదలైంది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 5 వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. మొత్తం ఖాళీలు 1,565 ఉన్నట్లు పేర్కొంది.

వీటిలో ఎల‌క్ట్రిష‌న్‌-630, ఫిట్ట‌ర్‌-425, మెకానిక్‌-175, వెల్డ‌ర్‌-80, కోపా-50, మెషినిస్ట్‌-50, ట‌ర్న‌ర్‌-50, సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌-50, ఎమ్మెల్టీ-30, ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ సిస్ట‌మ్ మెయింటేనెన్స్‌-25 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: ప‌దో త‌ర‌గ‌తి త‌ప్ప‌నిస‌రిగా ఉత్తీర్ణుల‌వ్వాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. అదేవిధంగా 18 నుంచి 30 ఏళ్లలోపు వారై ఉండాలి.

ఎంపిక విధానం: ‌మెరిట్ ఆధారంగా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌‌కు చివ‌రితేదీ: ‌అక్టోబ‌ర్ 5

వెబ్‌సైట్‌: centralcoalfields.in


Next Story

Most Viewed