- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్‌సీఈపీపై 15దేశాల సంతకాలు
దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంగా భావిస్తున్న ఆర్‌సీఈపీ (రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్షిప్)పై చైనా, జపాన్, దక్షిణ కొరియా సహా 15 ఆసియా పసిఫిక్ దేశాలు ఆదివారం సంతకం చేశాయి. వియత్నాం వర్చువల్‌గా నిర్వహించిన 37వ ఏషియన్ సమ్మిట్ చివరి రోజున ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రూనై, దారుస్సలాం, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆర్‌సీఈపీ రూపకల్పన దాదాపు దశాబ్దకాలం సాగింది.
ప్రాంతీయ దేశాల మధ్య వాణిజ్య సరుకులపై సుమారు 92శాతం పన్ను రాయితీలు, సభ్య దేశాలకు సేవారంగంలో 65శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశంలాంటి పలు అంశాలతో ఈ ఒప్పందాన్ని రూపొందించారు. ఈ ఒప్పందంలో చేరడంపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అణగారిన వర్గాలు, పాడి, నూనె గింజల రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఈ ఒప్పందంలో చేరవద్దని నిరసనలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది ప్రధాని మోడీ భారత్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయంపై సభ్యదేశాలు ఆందోళనపడినా, భారత్ కావాలనుకుంటే మళ్లీ ప్రత్యేకంగా ఒప్పందంలో చేరే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపాయి.