- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు BCCI గుడ్‌న్యూస్..
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్ ఈ ఏడాది ఏప్రిల్ 9 నుంచి నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇండియా, న్యూజీలాండ్ జట్లు తలపడుతున్న నేపథ్యంలో ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి కోసం లీగ్‌ను ఒక వారం ముందే ముగించనున్నది. ఇందుకు అనుగుణంగా తొలుత అనుకున్న ఏప్రిల్ 11న కాకుండా ఏప్రిల్ 9న లీగ్ ప్రారంభించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. మే 30 ఐపీఎల్ ఫైనల్ నిర్వహిస్తారు. దీనిపై వచ్చే వారంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అదే సమావేశంలో వేదికలపై కూడా పూర్తి స్పష్టత రానుంది.
కాగా, ముంబయిలో ఐపీఎల్ నిర్వహించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలంటూ బీసీసీఐ ప్రతినిధులు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కోరినట్లు సమాచారం. శరత్ పవర్ గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేశారు. అంతే కాకుండా ప్రస్తుత మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉన్నారు. అందుకే సీఎం ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడి ముంబయిలో ఐపీఎల్ నిర్వహించేందుకు సహాయం చేయాలని కోరినట్లు తెలుస్తున్నది. మహా ప్రభుత్వం ఒప్పుకుంటే ముంబయి వాంఖడే స్టేడియంలో కూడా మ్యాచ్‌లు జరుగుతాయి.