వృద్ధురాలికి 8మంది జననం.. కేవలం14నెలల్లోనే!

by  |
వృద్ధురాలికి 8మంది జననం.. కేవలం14నెలల్లోనే!
X

దిశ, వెబ్‌డెస్క్: వృద్ధురాలు 8 మంది ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. అది కూడా 14 నెలల వ్యవధిలోనే. ఇది చెబితే ఎవరూ నమ్మరు. కానీ, ఆ గనులు ప్రభుత్వాన్నే నమ్మించారు. ఎందుకంటే 65 ఏళ్ల వయసులో కృతిమంగా గర్భధారణ జరిగినా.. ఒకరు లేదా ఇద్దరికి జన్మనిచ్చే అవకాశం ఉంది. అంతే కానీ, 14 నెలల వ్యవధిలో 8 మందికి జన్మనివ్వడం అసాధ్యం. ఇదంతా డబ్బులు కోసం చేసిన తతంగం. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా ముసహరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంచార్జి ఉపేంద్ర చౌదరీకి అనుమానం రావడంతో ఈ స్కామ్ వెలుగుచూసింది.

ఆ రాష్ట్రంలో ఆడపిల్లల జననాల రేటును పెంచడం కోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఆడ శిశువుకు జన్మనిచ్చిన తల్లి ఖాతాలో రూ. 1400 చొప్పున జమ చేస్తోంది. ఇదే అదనుగా కొందరు డబ్బులు నొక్కేయడానికి ప్లాన్ వేశారు. 65 ఏళ్ల లీలాదేవి 14 నెలల వ్యవధిలో 8 మంది అమ్మాయిలకు జన్మిచ్చిందని నకిలీ పత్రాలు సృష్టించారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని ఆమె ఖాతాలో జమ చేయగా.. లీలాదేవి విత్ డ్రా చేసుకున్నట్లు క్రియేట్ చేశారు. అలాగే శాంతి దేవి అనే వయసు మళ్లిన మహిళ 9 నెలల వ్యవధిలో ఐదుగురికి జన్మనిచ్చిందని రికార్డులు రూపొందించారు.

అంతేకాకుండా, సోనియా దేవి అనే మహిళ 5 నెలల వ్యవధిలో నలుగురు పిల్లలకు జన్మనిచ్చినట్లు క్రియేట్ చేశారు. మీరు ఈ వయసులో పిల్లల్ని కన్నారా.. అని రికార్డుల్లో ఉన్న మహిళల దగ్గరకు వెళ్లి ప్రశ్నించగా.. వారు కాస్త గందగోళానికి గురయ్యారు. 40 ఏళ్ల వయసులో ఉన్న తమ సంతానాన్ని చూపించి.. తమకు పిల్లలు పుట్టి దశాబ్దాలు గడుస్తోందన్నారు. పీహెచ్‌సీ ఇంచార్జి ఫిర్యాదుతో కేసు నమోదు కాగా.. జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ ఈ అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఇందులో అక్రమాలు జరిగాయని అదనపు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ తేల్చింది. దీంతో ఈ స్కామ్‌లో హస్తమున్న వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed