ఏపీలో 132 కరోనా కేసులు

by srinivas |
ఏపీలో 132 కరోనా కేసులు
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన తబ్లిగ్ జమాత్ మర్కజ్‌కు ఆంధ్రప్రదేశ్ ‌నుంచి సుమారు 1036 మంది హాజరయ్యారు. అందులో 300 మందికి వైద్య ఆరోగ్య శాఖాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. తొలుత 87 కేసులు నమోదైతే వారిలో 70 మంది ఆ ప్రార్థనలకు వెళ్లిన వారే కావడం విశేషం. మిగిలిన వారిలో వారి కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులు, విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1800 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 1175 మందికి కరోనా నెగిటివ్‌గా వచ్చింది. మరో 493 పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. మూడు రోజుల్లో ఏపీలో 111 కేసులు నమోదవ్వగా ఈ రోజు వాటి సంఖ్య 132కి పెరిగింది. దీంతో నేటి ఉదయం మరో 21 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. కరోనా విస్తృతికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది.

ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, విపక్షాల నేతలు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లిగి జమాత్ మర్కజ్‌కి వెళ్లిన వారిని స్వచ్ఛందంగా వైద్యపరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. సీఎం జగనైతే కరోనా సోకిన వారిని నేరస్తులుగానో లేక తప్పు చేసిన వారిగానో చూడొద్దంటూ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో ఏపీలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముందని అంచనావేస్తున్నారు.

Tags: corona virus, andhrapradesh, covid-19, corona positive, increasing

Advertisement

Next Story

Most Viewed