ఏపీలో 24 గంటల్లో 125 కేసులు

by Anukaran |   ( Updated:2020-06-08 05:42:49.0  )
ఏపీలో 24 గంటల్లో 125 కేసులు
X

దిశ, ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ ఆగడం లేదు. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కాగా, ఏపీలో గడచిన 24 గంటల్లో 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 34 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,813కి చేరుకుంది. ఇందులో 838 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలని తెలిపింది. మరో 132 మంది విదేశాల నుంచి వచ్చిన వారు. ఏపీలో అసలు కేసుల సంఖ్య 3,843. ఇప్పటివరకు 2,387 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 1,381 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా రాష్ట్రంలో 75 మంది మృత్యువాత పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed