తెలంగాణలో కరోనా రికార్డు..@1213

by  |
తెలంగాణలో కరోనా రికార్డు..@1213
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా రికార్డు సృష్టిస్తోంది. వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. వందల నుంచి వేల సంఖ్యల్లో కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ తెలంగాణలో ఏకంగా 1,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ స్థాయిలో కేసులో నమోదు కావడం ఇదే తొలిసారి. ఇందులో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 998 కేసులు నిర్ధారణ కావడంతో నగర వాసులు భయాందోళన చెందుతున్నారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,570కు చేరుకుంది. మహమ్మారి కారణంగా ఈరోజు 8 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 275కు చేరింది. వైరస్ నుంచి కోలుకొని ఇప్పటివరకు 9069 మంది డిశ్చార్జి కాగా.. 9,226 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


Next Story

Most Viewed