- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్లోబల్ ప్రాజెక్ట్ ‘12 డిసిపుల్స్’.. ‘వైకింగ్’ స్టార్స్‌తో ఇంటర్నేషనల్ ఫ్లేవర్
దిశ, సినిమా : ప్రముఖ నిర్మాణ సంస్థ మీడియా టైమ్స్ ప్రొడక్షన్స్.. గ్లోబల్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. యూనివర్సల్ సబ్జెక్ట్‌తో యూనిక్ స్టోరీని తెరమీదకు తీసుకురాబోతోంది. ‘12 డిసిపుల్స్’ పేరుతో వస్తున్న సినిమాలో యేసుక్రీస్తును శిలువ వేసిన తర్వాత అతడి 12 మంది శిష్యుల జీవితం గురించి కథ ఉండబోతున్నట్లు నిర్మాత అల్తాఫ్ హమీద్ తెలిపారు. నాగరాజన్ తులసింగమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు జాహిద్ అహ్మద్ నౌజావన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నట్టు వెల్లడించారు.
‘12 డిసిపుల్స్’ కథను చాలా మంది బైబిల్‌లో చదివి ఉండొచ్చు, కానీ దీనికి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అవసరమని భావించే.. వరల్డ్ వైడ్‌గా ఏ ప్రొడక్షన్ హౌజ్ టచ్ చేయని ఈ టాపిక్‌ను ఎంచుకున్నట్టు స్పష్టం చేశారు. తాను ముస్లిం అయినా దేవుడు పంపిన దూతలు, వారి సూత్రాల గురించి నమ్ముతానన్న నిర్మాత.. 27 దేశాల్లో సినిమా షూటింగ్ జరగబోతుందని వివరించారు. ఇంగ్లీష్, ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లోనూ సినిమాను విడుదల చేస్తామని తెలిపిన అల్తాఫ్.. ఇది తమకు చాలెంజింగ్ మూవీ అని, ఆస్కార్ అవార్డు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇక సినిమాకు సంబంధించిన ఫొటో సెషన్ ముంబైలో ఈ మధ్యే జరగ్గా.. మూవీకి ఇంటర్నేషనల్ ఫ్లేవర్ యాడ్ చేసేందుకు వరల్డ్ వైడ్ పాపులర్ అయిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘వైకింగ్’ నుంచి నటీనటులను ఎంచుకోబోతున్నారు. అంతేకాదు 2000 ఏళ్ల క్రితం క్రీస్తు యుగానికి సంబంధించిన అట్మాస్పియర్‌ను సెట్స్‌లో రీక్రియేట్ చేస్తున్నారు. మే నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న సినిమాకు డి ఇమాన్ సంగీతం అందించనుండగా.. కెమెరామెన్‌గా సుకుమార్ ఎం, ప్రొడక్షన్ డిజైనర్‌గా ముత్తురాజ్ పనిచేయనున్నారు.