కరీంనగర్‌లో 12మందికి కరోనా..ఒకరు మృతి

by vinod kumar |   ( Updated:2020-06-26 06:33:08.0  )
కరీంనగర్‌లో 12మందికి కరోనా..ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్భపూర్‌ గ్రామంలో కరోనా వైరస్ బీభత్సం సృష్టించింది. ఒక్కరోజు వ్యవధిలోనే 12 మందికి కరోనా పాజిటివ్ రాగా, ఈ మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు.ఈ ఘటనతో గ్రామస్తులందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు 22 మందిని క్వారంటైన్‌కు తరలించారు. కరోనా మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకునేందుకు వల్భపూర్‌ గ్రామాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటిస్తున్నట్టు గ్రామ పంచాయతీ సభ్యులు నిర్ణయించారు. ఈనెల 28నుంచి 15రోజుల పాటు స్వచ్ఛంద లాక్‌డౌన్ అమలు‌ చేస్తూ గ్రామస్థులు తీర్మానించారు.



Next Story