- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుశాంత్ కేసులో 11,700 పేజీల ఎన్‌సీబీ చార్జిషీట్
ముంబయి : బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దర్యాప్తులో భాగంగా దాఖలైన డ్రగ్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) శుక్రవారం 11,700 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కోర్టులో దాఖలైన ఈ చార్జిషీటులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిలతోపాటు మరో 31 మంది నిందితుల పేర్లను పేర్కొంది. సుమారు 200 మంది సాక్షుల వాంగ్మూలాను పొందుపరిచింది. డ్రగ్స్ లభించిన నిందితులపై నిర్వహించిన మాదకద్రవ్యాల పరీక్షలో అందిరికీ పాజిటివ్ వచ్చిందని పేర్కొనడం గమనార్హం.
ఈ చార్జిషీటు కాపీలను నిందితులకు అందనున్నాయి. కోర్టు చార్జిషీటును పరిశీలించి రెగ్యులర్ హియరింగ్ మొదలుపెట్టాల్సి ఉన్నది. ఎన్‌సీబీ గతేడాది ఆగస్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో ముంబయిలోని అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాదక ద్రవ్యాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎన్‌సీబీ దర్యాప్తు మొదలుపెట్టింది. దర్యాప్తులో భాగంగా పలువురు సెలెబ్రిటీలు, ప్రముఖులను ఎన్‌సీబీ విచారించిన విషయం విదితమే.