ఉమ్మడి నిజామాబాద్‌లో 11 పాజిటివ్ కేసులు

by  |
ఉమ్మడి నిజామాబాద్‌లో 11 పాజిటివ్ కేసులు
X

దిశ, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం 11 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో నిజామాబాద్‌లో 9 నిర్ధారణ కాగా, కామారెడ్డి జిల్లాలో రెండు కేసులు పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌కు, మరో వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. అంతేగాకుండా గౌతమ్ నగర్ 2, బర్కత్ పుర 1, దుబ్బలో 1, భీంగల్, ఆర్మూర్, బోధన్‌పాన్‌గల్లీలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకూ 131 కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండు పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో వారు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో అనే విషయాలపై అధికారులు ఆరా తీసి, క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.


Next Story