రాష్ట్రంలో 10,500 పబ్లిక్​ టాయిలెట్లు

by  |
రాష్ట్రంలో 10,500 పబ్లిక్​ టాయిలెట్లు
X

దిశ, న్యూస్​బ్యూరో: ఆగస్టు 15నాటికి రాష్ట్రవ్యాప్తంగా 10,500 పబ్లిక్​ టాయిలెట్లను ప్రారంభించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​ కుమార్​ తెలిపారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహరాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్​ను నిర్వహించారు. రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్, స్మార్ట్ సిటీ , ప్రధాన మంత్రి అవాస్ యోజన తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సోమేష్​ కుమార్​ మాట్లాడుతూ ప్రతి వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటిలో 50శాతం మహిళలకు కేటాయించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 400 మొబైల్ టాయిలెట్లను అక్టోబర్ 2న ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రాంలోని 132పట్టాణాలలో బయోమైనింగ్ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో వీధి వ్యాపారులను గుర్తించేందుకు వార్డు స్థాయి బృందం ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామం చేస్తున్నామని, దీనిద్వారా 5లక్షల వీధి వ్యాపారులను గుర్తించడానికి లక్ష్యంగా నిరేంశించుకున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.


Next Story