డీటీహెచ్‌ సెక్టార్‌లోకి 100శాతం ఎఫ్‌డీఐ

by Shamantha N |
డీటీహెచ్‌ సెక్టార్‌లోకి 100శాతం ఎఫ్‌డీఐ
X

న్యూఢిల్లీ: డీటీహెచ్ సేవలను అందించే మార్గదర్శకాల్లో సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫలితంగా డీటీహెచ్ లైసెన్స్ కాలాన్ని 20 ఏండ్లకు పెంచింది. ఇప్పటి వరకు పదేండ్లకు ఒకసారి లైసెన్సులు జారీ చేయాల్సి ఉంది. కొత్త మార్గదర్శకాలు ఈ రంగంలోకి 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుమతిస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ తెలిపారు. ఇప్పటి వరకు 49శాతానికే ఎఫ్‌డీఐలకు అనుమతి ఉన్నది. దీనికోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)తో కేంద్రం సంప్రదింపులు జరిపే ఈ నిర్ణయం తీసుకుంది.

నాలుగు సినీ విభాగాలు ఫిలిం డివిజన్ ఆఫ్ ఇండియా, డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్, నేషనల్ ఫిలిం అర్కైవ్స్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీలను విలీనం చేసే నిర్ణయం తీసుకుంది. అలాగే, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీం కోసం రూ. 59వేల కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది. ఫలితంగా ఐదేండ్లలో నాలుగు కోట్ల ఎస్సీ విద్యార్థులు లబ్దిపొందనున్నట్టు కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ. 35,534 కోట్లను అందజేయగా, మిగతావి రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed