- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేటలో 100 శాతం డెల్టా వేరియంట్
దిశ, తెలంగాణ బ్యూరో : సిద్ధిపేట్ జిల్లాలో ఆగస్టు నెలలో తేలిన పాజిటీవ్‌లన్నీ ఒరిజినల్ డెల్టా వేరియంతో వచ్చాయని జీఐఎస్ఏఐడీ (గ్లోబల్ ఇన్టీయేటీవ్ ఇన్ షేరింగ్ ఆఫ్ అవేన్ ఇన్ ప్లూయేంజా) సర్వేలో వెల్లడైంది. మన రాష్ర్టంలో డెల్టా వేరియంట్ ప్రభావం ఏ మేరకు ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు జీఐఎస్ఏఐడీ గత నెలలో హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సిద్దిపేట్ ప్రాంతాల్లో అధ్యయనం చేసింది. ఆ నాలుగు జిల్లాలకు చెందిన వ్యక్తుల నుంచి 71 శాంపిల్స్‌ను ఎయిర్ పోర్టులో సేకరించి జీనోమ్ సీక్వెన్సీ టెస్టులు నిర్వహించగా, 32 శాంపిల్స్ (45 శాతం) ఒరిజినల్ డెల్టాతో కేసులు తేలగా, మిగతా శాంపిల్స్‌లో డెల్టా ఏవై 4,5,12,17,16,23 మిక్స్ డ్ వేరియంట్ తో పాజిటివ్ తేలిందన్నారు. అదే విధంగా కమ్యూనిటీల్లో 14 శాంపిల్స్ కు టెస్టులు చేయగా 8(57 శాతం) ఒరిజినల్ డెల్టా దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ సర్వే ప్రకారం సిద్దిపేట్‌లో 100 శాతం ఒరిజినల్ డెల్టా వేరియంట్ ఉండగా, వికారాబాద్ లో 50, మేడ్చల్, హైదరాబాద్‌లో 35 శాతంతో కేసులు వచ్చినట్లు ఎక్స్ పర్ట్స్ వెల్లడించారు.