కండలతో ఆకట్టుకుంటున్న ‘సూపర్’ బాయ్

దిశ, వెబ్‌డెస్క్ : ఓ పదేల్ల పిల్లోడు.. తన దేహదారుఢ్యంతో సోషల్ మీడియాను తనవైపు తిప్పుకున్నాడు. సినిమాల్లో హీరోలు కండల ప్రదర్శన చేసినట్లు.. వియత్నాంకు చెందిన న్యుయెన్ హోంగ్ నామ్ కూడా తన అద్భుతమైన ఫిజిక్‌తో ఫొటోలకు ఫోజులిచ్చాడు. అవి కాస్తా ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా నిలవడం విశేషం. అయితే, ఇవి తను గంటల తరబడి జిమ్‌లో కష్టపడి తెచ్చుకున్న కండలు కాదు. కర్ణుడికి పుట్టుకతోనే కవచకుండలాలు వచ్చినట్లు.. ఈ పిల్లోడికి కూడా సహజంగానే వచ్చాయి.

హోంగ్ నామ్.. పుట్టడమే మంచి ఫిజిక్‌తో పుట్టాడు. ఇతర పిల్లలతో పోల్చి చూసినప్పుడు ఈ చిన్నోడి శరీర ధారుడ్యం.. అతని తల్లిదండ్రులకు ఆశ్చర్యం కలిగించేది. దీంతో 6 ఏళ్ల వయసులో నామ్‌ను డాక్టరు దగ్గరకు తీసుకెళ్లారు. పుట్టినప్పుడే ఈ భేదాన్ని గమనించినట్లు స్పష్టం చేసిన వైద్యులు.. నామ్‌కు ‘సూపర్‌మ్యాన్ సిండ్రోమ్’ ఉన్నట్లు తెలిపారు. ‘హైపర్ ట్రోఫీ’ అని కూడా పిలిచే ఈ సిండ్రోమ్‌ను క్రోమోజోమ్‌ల డిజార్డర్‌‌‌గా చెబుతారన్నారు. అయితే, దీని వల్ల నామ్ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని భరోసానిచ్చారు.

ఎక్కడికెళ్లినా తన ఫిజిక్‌తో అందరి అటెన్షన్‌ను గ్రాబ్ చేసే నామ్‌ను.. ఎంతోమంది ఆన్‌లైన్ ఇన్‌ప్లూయెన్సర్స్ తమ తమ వ్లాగ్స్‌లో చూపించాలని అతడి పేరెంట్స్‌ను కోరారు. కానీ అందుకు వారు ఒప్పుకోలేదు. ఎక్స్‌ట్రా అటెన్షన్ నామ్ ఆరోగ్యానికి అంత మంచిదికాదని వారు భావించడమే అందుకు కారణం. ఇటీవలే వియత్నాం బాడీబిల్డర్ డాంగ్ నాయ్ దృష్టిలో నామ్ పడటంతో.. అతను తన పేరెంట్స్‌ను కలిశాడు. నామ్‌కు మంచి శిక్షణ ఇస్తే తన ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఎట్టకేలకు వాళ్లు ఒప్పుకోవడంతో నామ్.. మూడు నెలలు జిమ్ ట్రైనింగ్ పొందాడు. కాగా కరాటే, యోగాల్లో తనకు శిక్షణ ఇప్పించాలని అతడి ఫ్యామిలీ భావిస్తోంది.

Advertisement