- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్‌లో మరో 10 పాజిటివ్ కేసులు
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో తాజాగా మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శనివారం 41మంది రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించగా అందులో 20 మందికి సంబంధించిన రిపోర్టులు వచ్చాయన్నారు. ఈ రిపోర్టులో 10మందికి కరోనా సోకిందని వివరించారు. వారిలో 7గురు ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వారు కాగా, మిగిలిన ముగ్గురు పాజిటివ్ వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న వారు, వారి బంధువులు అని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో పాజిటివ్ కేసులు 29కు చేరాయని చెప్పారు. పాజిటివ్ వచ్చిన 10 మందిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 305 మందిని ప్రాథమికంగా, 293మందిని సెకండరీగా గుర్తించి వారందరికి క్వారంటైన్‌లో ఉంచినట్టు తెలిపారు. జిల్లాలో మరికొంత మందికి సంబంధించిన రిపోర్టులు నేటి రాత్రి లేదా ఉదయం వరకు వస్తాయన్నారు. జిల్లాలో 59 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చారని, వారిలో ఒక్కరు మినహా మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించామన్నారు. వీరందరిలోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామని వెల్లడించారు.
నేటి అర్ధరాత్రి నుంచి కంటామినెంట్ క్లస్టర్ బ్లాక్..
జిల్లాలో కరోనా విస్తరించకుండా ఉండేందుకు సోమవారం అర్ధరాత్రి నుంచి జిల్లా అధికార యంత్రాంగం గుర్తించిన కంటామినెంట్ క్లస్టర్‌లను టోటల్‌గా బ్లాక్ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రకటించారు. కరోనా పాజటివ్ కేసుల సంఖ్య పెరగడంతో నిజామాబాద్‌ను ఇది వరకే హట్ స్పాట్‌గా గుర్తించి కట్టడి చేస్తున్నామన్నారు. జిల్లాలోని బర్కత్ పుర, ఖల్లా రోడ్, ఆటో నగర్, హబీబ్ నగర్‌లతో పాటు మాక్లూర్, నందిపేట్, భీంగల్, బోధన్ ప్రాంతాల్లో పాజిటివ్ వ్యక్తులుండే ప్రాంతంలో పోలీసుల సహయంతోకిలో మీటర్ మేర బ్లాక్ చేస్తామని తెలిపారు. క్లస్టర్ ఎరియాలోకి ఎవరూ రావడం, పోవడం ఉండదన్నారు. 15 రోజుల ఈ బ్లాకింగ్ కొనసాగుతుందని, ఆయా ప్రాంతాల ప్రజలకు నిత్యావపర సరుకులను డోర్ డెలివరీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాజిటివ్ కేసులు పెరిగే కొద్ది టోటల్‌గా బ్లాక్‌లను మూసివేస్తామన్నారు. జిల్లా జనరల్ అస్పత్రిని 500 పడకలతో కోవిడ్-19 ఆస్పత్రిగా మార్చుతున్నామని చెప్పారు.కోవిడ్ విస్తరణను అడ్డుకోవడానికి అన్ని ప్రభుత్వపరంగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.
tags: corona, lockdown, 10 positive cases, nizamabad district