- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాను జయించిన పది నెలల చిన్నారి
దిశ,జగిత్యాల : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అందరిపై తన ప్రభావం చూపిస్తోంది. తాజాగా మహమ్మారి బారిన పడిన ఓ పది నెలల చిన్నారి మాత్రం ఎట్టకేలకు కరోనాను జయించి జిల్లాలో రికార్డు సృష్టించింది.ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో గురువారం వెలుగు చూసింది. వివరాల్లోకివెళితే.. వర్షకొండ గ్రామానికి చెందిన వేముల ఆనంద్, రాధిక దంపతులకు పది నెలల కుమార్తె ఆరాధ్య ఉంది. తండ్రి ఆనంద్‌కు కరోనా లక్షణాలు ఉండటంతో గత నెలలో ర్యాపిడ్ పరీక్ష నిర్వహించగా నెగెటివ్ వచ్చింది.
అతడి భార్యకు మాత్రం పాజిటివ్ రాగా, మరుసటి రోజు కుమార్తె ఆరాధ్యకు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ కుటుంబం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. తల్లిదండ్రులు మంచి ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా మందులు వేసుకున్నారు. చిన్నారికి కూడా వైద్య సిబ్బంది ఇచ్చిన మందులు వేశారు. చివరగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసుకోగా ముగ్గురికి నెగెటివ్ వచ్చినట్లు తేలింది. తమ కూతురు కరోనాను జయించడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, పలువురు సంతోషం వ్యక్తం చేశారు.