- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కురిచేడులో దారుణం.. పదికి చేరిన మృతుల సంఖ్య
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా కురిచేడులో దారుణం జరిగింది. శానిటైజర్ తాగి అస్వస్థతకు గురైన వారిలో ఇప్పటివరకు పది మంది మృతి చెందారు. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్థానికంగా మద్యం దుకాణాలు మూసివేశారు. దీంతో పలువురు యాచకులు, స్థానికులు అల్కాహాలిక్ కంటెంట్ ఉన్నశానిటైజర్ తాగారు. మద్యం దొరకకపోవడంతో వీరంతా శానిటైజర్‌కు అలవాటు పడ్డట్లు తెలుస్తోంది. రాత్రి వరకు ముగ్గురు మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారిలో అనుగొండ శ్రీను బోయ(25), భోగేమ్ తిరుపతయ్య (37), గుంటక రామిరెడ్డి (60), కడియం రమణయ్య (30), కొనగిరి రమణయ్య (65), రాజారెడ్డి (65), బాబు(40), చార్లెస్ (45), అగస్టీన్ (47), ఎస్కే సైదా (25)లుగా గుర్తించారు.
పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని కురిచేడులో లాక్‌డౌన్ విధించారు. దీంతో మద్యం షాపులు మూతబడ్డాయి. ఈ క్రమంలోనే వారంతా శానిటైజర్ తాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శానిటైజర్ తాగడం వల్లే మృతి చెందారా? లేక నాటుసారా, కల్తీ మద్యం ఏమైనా సేవించి ఉంటారా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బాధిత కుటుంబాలను పరామర్శించారు.