- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మేడ్చల్ జిల్లా ప్రజలకు శుభవార్త.. ఇక నుంచి ఫ్రీగా..
దిశ ప్రతినిధి, మేడ్చల్: పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్న బస్తీ దవాఖానల సేవలు మరింత విస్తరించనున్నాయి. మేడ్చల్ జిల్లాలో ఇప్పటికే బస్తీ దవాఖానలు సేవలందిస్తుండగా,శుక్రవారం తాజాగా మరో 10 బస్తీ దవాఖానలు ప్రారంభం కానున్నట్లు జిల్లా ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ కె.మల్లీకార్జున్ రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్ఎల్ బీ నగర్ కమ్యూనిటీ హాల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించగా, ఓల్డ్ బోయిన్ పల్లిలోని శాంతి నికేతన్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన దవాఖానను ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు ప్రారంభించనున్నారు. నాచారంలోని అన్నపూర్ణ కాలనీలో ఎమ్మెల్సీ సురభీవాణిదేవి, బీరప్ప గడ్డ కమ్యూనిటీ హాల్, హబ్సీగూడ జెడ్పీ స్కూల్ లో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఫిరోజ్ గూడ నార్త్ ఆఫీస్ లో కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు,హైదర్ నగర్ వార్డు కార్యాలయంలో గాంధీ, అపూరూప కాలనీ కమ్యూనిటీ హాల్ లో వివేకానంద, చెక్ పోస్టు కమ్యూనిటీ హాల్ లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మీణా ఉపేందర్ రెడ్డి, ఓల్డ్ మీర్జాదిగూడ రాజశ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కార్పొరేటర్ రాముయాదవ్ లు ప్రారంభిస్తారని జిల్లా ఆరోగ్య వైధ్యాశాఖ అధికారి డాక్టర్ మల్లీకార్జున్ రావు వెల్లడించారు.