- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
’అలుగు‘ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: అలుగు అక్రమ రవాణా కేసులో పదిమందిని అరెస్టు చేసినట్టు జిల్లా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వినోద్ కుమార్ ప్రకటించారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి నుంచి అలుగును అక్రమ రవాణా చేసేందుకు కుమార్, సంతోష్, శేఖర్, ప్రకాష్, దావూద్, రవీందర్, చిరంజీవి, మల్లికార్జున్, పోచయ్య అనే కొందరు ముఠాగా ఏర్పడి, అలుగును ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు.
ఈ క్రమంలో ముఠా సభ్యుల్లో కొంతమంది తమవద్ద అలుగు ఉన్నట్టు యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడంతో అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందింది. దీంతో ఇది పక్కా సమాచారంతో వ్యూహాత్మకంగా వలపన్ని పట్టుకున్నట్టు వెల్లడించారు. ముఠా సభ్యులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి, మంగళవారం కోర్టులో హాజరుపరిచినట్టు వివరించారు. ఈ కేసును ఛేదించిన అటవీశాఖ బృందాన్ని ఆయన అభినందించారు.
Advertisement
Next Story