‘సరిలేరు నీకెవ్వరు’కు ఏడాది..

by Shyam |
‘సరిలేరు నీకెవ్వరు’కు ఏడాది..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ గతేడాది సంక్రాంతి బరిలో నిలిచిన సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఈ చిత్రం ద్వారా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. కాగా ‘బ్లాక్ బస్టర్ కా బాప్‌’ అంటూ టాలీవుడ్‌లో రికార్డులు సెట్ చేసిన ఈ సినిమా రిలీజై నేటితో వన్ ఇయర్‌ కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు, మహేశ్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

‘జనవరి 11, 2020 గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. గుర్తుండిపోయే రోజు. థియేటర్లన్నీ ఒక పండగలా ఊగిపోయిన సంక్రాంతి. కొండారెడ్డి బురుజు విజువల్స్.. చుక్క చెమట పట్టలేదు, నా చొక్కా గుండి ఊడలేదు అన్న మహేశ్ డైలాగ్స్.. మైండ్ బ్లాక్ అంటూ ఆయన వేసిన స్టెప్పులు.. ఇలా ఎన్నో ఎన్నెన్నో మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయి’ అని ఆ రోజును గుర్తు చేసుకున్నారు అనిల్ రావిపూడి. సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌కు వన్ ఇయన్ అంటూ పోస్టర్ షేర్ చేస్తూ మహేశ్‌కు థాంక్స్ చెప్పాడు.

Advertisement

Next Story