మాస్క్ ధరించకపోయినా.. ఉమ్మినా రూ. లక్ష జరిమానా

by Shamantha N |   ( Updated:2020-07-23 06:33:21.0  )
మాస్క్ ధరించకపోయినా.. ఉమ్మినా రూ. లక్ష జరిమానా
X

దిశ, వెబ్‌డెస్క్: ఆ రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా.. మాస్క్ ధరించకపోయినా చేతి చమురు వదిలించుకోవాల్సిందే. వంద కాదు ఐదు వందలు కాదు ఏకంగా రూ. లక్ష జరిమానా కట్టాల్సి ఉంటుంది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏకంగా రెండేళ్ల పాటు జైల్లో మగ్గాల్సి ఉంటుంది. ఈ మేరకు గురువారం జార్ఖండ్ ప్రభుత్వం అంటువ్యాధుల ఆర్డినెన్స్ (ఐడిఓ) 2020 ను జారీ చేసింది. ఇకపై సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినా, మాస్కులు ధరించని వారు రూ .1 లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఐడిఓ 2020‌లో జార్ఖండ్ ప్రభుత్వం తెలిపింది. కాగా, జార్ఖండ్‌లో రోజుకు కరోనా వ్యాప్తి తీవ్రమవుతుండటంతో ప్రభుత్వం భారీ స్థాయిలో జరిమానాలను పెంచింది.

Advertisement

Next Story

Most Viewed