- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ప్రపంచం: ఒక్కరోజే 1.83 లక్షల కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్ర రూపం దాల్చింది. శని, ఆదివారం మధ్య 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1.83 లక్షల కేసులు ప్రపంవ్యాప్తంగా నమోదయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఒక రోజే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం కొత్తగా నమోదు అవుతున్న కేసుల్లో బ్రెజిల్ (54,771) మొదటి స్థానంలో ఉండగా, అమెరికా 36,617 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. భారత్ లోనూ ప్రతి రోజు 15,000 పైబడే కేసులు నమోదు అవుతున్నాయి.
తాజాగా నమోదైన కేసులతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 87,08,008 కేసులు నమోదయ్యాయి. 4,61,715 మంది వైరస్ బారిన పడి కోలుకోలేక మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో లాక్‌డౌన్ సడలించడంతోనే వైరస్ తీవ్రత పెరిగిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
బ్రెజిల్‌లో కరోనా కల్లోలం
కరోనా పంజా విసరడంతో బ్రెజిల్ అతలాకుతలం అవుతోంది. ఒక్క రోజు వ్యవధిలోనే అక్కడ 50 వేల పైబడే కేసులు నమోదు అవుతున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో బ్రెజిల్‌లో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అలాగే మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇప్పటికే అక్కడ మరణాలు 50 వేలు దాటాయి. అమెరికాలోనూ కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటి వరకు అక్కడ 23,11,345 కేసులు నమోదయ్యాయి.