ప్రపంచవ్యాప్తంగా 1.8 కోట్ల మంది భారత ప్రవాసీలు : ఐరాస

by Shamantha N |
ప్రపంచవ్యాప్తంగా 1.8 కోట్ల మంది భారత ప్రవాసీలు : ఐరాస
X

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రవాసీలు భారత్ నుంచే ఉన్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 1.8 కోట్ల మంది భారతీయులు 2020లో భారత్ వెలుపల వివిధ దేశాల్లో నివసించారని పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూఎస్, సౌదీ అరేబియాలు అత్యధిక సంఖ్యలో భారతీయులకు ఆశ్రయమిచ్చాయని వివరించింది. గల్ఫ్ మొదలు ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, యూకేల వరకూ భారత సంతతి వ్యాపించి ఉన్నదని జనాభా వ్యవహారాల అధికారి క్లేర్ మెనోజీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed