పుంటికూర మటన్

by  |
పుంటికూర మటన్
X

కావాల్సినవి

500 గ్రాముల మటన్, చిన్నసైజు మూడు కట్టల పుంటికూర, మంచినూనె, నాలుగు లవంగాలు, చిన్న చెక్క ముక్క, మూడు పచ్చిమిరపకాయలు, రెండు చిన్న ఉల్లిపాయలు, సగం టీస్పూన్ ఉప్పు, పసుపు, రెండు రెమ్మల కరివేపాకు, రెంటు టీస్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ల కారం, టీస్పూన్ ధనియాల పొడి, సగం టీ స్పూన్ జీలకర్ర పొడి

తయారు చేసే విధానం

– మొదట పుంటికూరను మెత్తబడే వరకు వేయించుకోవాలి.
– వేయించిన పుంటికూరను మిక్సిలో వేసి పేస్టులా చేసి పెట్టుకోవాలి.
– కుక్కర్‌లో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యే వరకు వేచి ఉండాలి. అందులో లవంగాలు, చెక్కవేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కాసేపు వేగన తర్వాత ఉప్పు, పసుపు వేయాలి. ఆ తర్వాత కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేయించాక శుభ్రంగా కడిన మటన్ వేయాలి. కారం, ధనియాలు, జీలకర్ర పొడులను వేయాలి. 10 నిమిషాలపాటు మధ్యమధ్యలో కలపాలి. మటన్ వేగిన తర్వాత గ్లాస్ నీళ్లు పోయాలి. రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు వేచి ఉండాలి. మటన్ ఉడికిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పుంటికూర పేస్టు, గరం మసాలా పౌడర్‌ను వేయాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి. అప్పుడు రుచికరమైన పుంటికూర మటన్ రెడీ అవుతుంది.


Next Story