- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ నేత లేఖ.. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్‌లో రెండు రోజుల క్రితం డాక్టర్ సుధాకర్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో క్లిప్పింగును జత చేస్తూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను ఏపీ హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. దీనిని విచారించిన ధర్మాసనం డాక్టర్ సుధాకర్‌ను తమ ఎదుట హాజరు పరచాలని, అంతే కాకుండా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను రేపటికి వాయిదా వేసింది.
డాక్టర్ సుధాకర్ అంశాన్ని పార్టీలు రాజకీయానికి వాడుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాయని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదన వినిపించారు. టీడీపీ నేత అనిత హైకోర్టుకు పంపిన వీడియో ఎడిట్ చేసిన వీడియో అని, ప్రధానితో పాటు ముఖ్యమంత్రిని సుధాకర్ దూషించిన వీడియోలను లేఖతో ఎందుకు జతచేయలేదని ప్రశ్నించారు. అంతే కాకుండా ఈ కేసులో నిందితుడైన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్టు వివరించారు. మరోవైపు, డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖ పోలీసులు అనుమానుషంగా ప్రవర్తించారని, అందుకు బాధ్యులైన పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి సీహెచ్ వెంటకేశ్వర్లు హైకోర్టులో పిల్ వేసిన సంగతి తెలిసిందే.