Trending: కాలిఫోర్నియా వీధుల్లో సందడి చేస్తోన్న ఆటోరిక్షా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Disha Web Desk 1 |
Trending: కాలిఫోర్నియా వీధుల్లో సందడి చేస్తోన్న ఆటోరిక్షా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటోరిక్షా.. ఇండియాలోని పేద, మధ్య తరగతి కుటుంబాలు ప్రయాణించే రవాణా వ్యవస్థ. చాలా నగరాల్లో ఆటో రిక్షాను టక్..టక్ అని కూడా పిలుస్తుంటారు. దేశ వ్యాప్తంగా రోజుకు మిలియన్ల కొద్ది మంది అందులో ప్రయాణిస్తుంటారు. ఇక ఈ మధ్య ఉబర్, ర్యాపిడో వచ్చా వాటి వినియోగం ఇంకా పెరిగింది. ఇంట్లో ఉండి బుక్ చేసినా సరే.. నావిగేషన్ సాయంతో నిమిషాల్లో మన ఇంటి ముందుకు ఆటో రిక్షాలు వచ్చే రోజులివి.

అయితే, మన దేశంలో ఆటో-రిక్షాను చూడటం సర్వ సాధారణం. కానీ, ఇటీవలే కాలిఫోర్నియా వీధుల్లో నలుపు, పసుపు రంగులో ఉన్న ఆటో రిక్షా చెక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాన ఊపేస్తోంది. మన కళ్లే మోసపోయే విధంగా ఇండియానా లేక అమెరికా అన్న ఫీలింగ్ కలుగుతోంది. తాజాగా.. మనోహర్ సింగ్ రావత్ అనే ఇన్‌స్టా యూజర్ కాలిఫోర్నియాలో ఆటో రిక్షా తిరుగుతుండగా ఆ వీడియోను క్యాప్చర్ చేశాడు. అనంతరం ఆ ఫుటేజ్‌ను ‘కాలిఫోర్నియాలో ఆటో రిక్షా.. #ఆర్టీసియా’ అని ట్యాగ్ షేర్ చేయగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read More...

క్యాన్సర్‌కు కారణమవుతున్న కారు... పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..

Next Story

Most Viewed