200కు 212 మార్కులు.. నాలుగో తరగతి కుర్రాడి మార్క్ షీట్ వైరల్..

by Dishafeatures3 |
200కు 212 మార్కులు.. నాలుగో తరగతి కుర్రాడి మార్క్ షీట్ వైరల్..
X

దిశ, ఫీచర్స్: 'రేయ్ నువ్వు వంద మార్కులకు ఎగ్జామ్ రాస్తే ఎంత రాసినా అంతకన్నా ఎక్కువ రావని గుర్తుంచుకో' అని ఓ సినిమా డైలాగ్ విన్నారా? నిజమే కదా.. ఎక్స్ ట్రా ఆన్సర్స్ రాసినా అంతకు మించి మార్కులు వేసే అవకాశం లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉంటాయి మరి. కానీ గుజరాత్ లో మాత్రం ఇందుకు భిన్నంగా జరగడంతో ఆ కుర్రాడి మార్క్ షీట్ నెట్టింట వైరల్ అవుతుంది.



ఝలోడ్ తాలూకా ఖరసానా గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు ముఖేష్. అయితే రీసెంట్ గా అకాడమిక్ పరీక్షలు పూర్తి కావడంతో స్టూడెంట్ కు రిపోర్ట్ కార్డు ఇచ్చారు. ఇందులో గుజరాతీ, గణితంలో 200 మార్కులకు గాను 212, 211 మార్కులు వచ్చినట్లు ఉంది. దీంతో ఈ కార్డ్ నెట్టింట వైరల్ అయింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. సోమరిపోతులు టీచర్లు అయితే ఇలాగే ఉంటుందని తిడుతున్నారు. ఈ కుర్రాడు కచ్చితంగా IAS అయిపోతాడని మరికొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.


Next Story

Most Viewed