- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిలీలో కార్చిచ్చు బీభత్సం.. అత్యవసర పరిస్థితి విధింపు
దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కార్చిచ్చు (Wildfires) ప్రళయం సృష్టిస్తోంది. వే

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కార్చిచ్చు (Wildfires) ప్రళయం సృష్టిస్తోంది. వేల ఎకరాల అడవిని దహించివేస్తూ మంటలు వేగంగా గ్రామాలకు విస్తరిస్తుండటంతో చిలీ ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల్లో 'ఎమర్జెన్సీ' (అత్యవసర పరిస్థితిని) ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా వీస్తున్న గాలులు, తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారింది. ఇప్పటికే వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతవ్వగా, అధికారులు వేల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
జనావాసాలను మంటలు చుట్టుముట్టడంతో ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు సైన్యం రంగంలోకి దిగింది. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. ఆకాశమంతా దట్టమైన పొగ కమ్మేయడంతో విమాన రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. పర్యావరణ వ్యవస్థకు భారీగా నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేసిన అధికారులు, బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
Read More..






