బలరాం నాయక్‌ను గెలిపిస్తే బయ్యారాన్ని బంగారు కొండ చేస్తా : మంత్రి తుమ్మల

by Disha Web Desk 23 |
బలరాం నాయక్‌ను గెలిపిస్తే బయ్యారాన్ని బంగారు కొండ చేస్తా : మంత్రి తుమ్మల
X

దిశ, బయ్యారం: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే,అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే బయ్యారం బంగారు కొండ గా తీర్చి దిద్దే బాధ్యత నాది అని అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక శంఖారావం సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తుమ్మల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వుంది రోజులలో అనేక హామీలు నెరవేర్చామని , రైతుల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించామని అన్నారు. రాష్ట్రంలో రాబోయే ఖరీఫ్ పంట కాలంలో ఫసల్ భీమా యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రకృతి వైపరిత్యాలతో పంట నష్ట పోతే ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం చెల్లించి పంట నష్టపరిహారం అదే విధంగా చూస్తామని తెలిపారు.

పోరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ చేపూరి మౌనిక బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అదేవిదంగా పలు గ్రామాల బిఆర్ఎస్ ముఖ్య నాయకులు పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్,ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య,జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి, పిసిసి జిల్లా నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి,సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి,మండల అధ్యక్షుడు ముసలయ్య , ఇతర నాయకులు కిషన్, ప్రభాకర్ రెడ్డి, ప్రవీణ్ నాయక్, వీరారెడ్డి, నాయిని శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed