కొత్తగూడలో గుప్త నిధుల కలకలం..!

by Disha Web Desk 11 |
కొత్తగూడలో గుప్త నిధుల కలకలం..!
X

దిశ, కొత్తగూడ: సులభంగా ధనం సంపాదించాలని కొందరు వ్యక్తులు అడ్డదారుల్లో ప్రయత్నాలు చేస్తుంటారు. చివరికి అవి ఫలించకపోగా చిక్కుల్లో పడుతున్నారు. అలాంటి ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని చింత గడ్డతండాలో చోటుచేసుకున్నది. స్థానికులు,భూ యజమాని వెంకటేష్ కథనం మేరకు కొత్తగూడ మండలం చింతగడ్డ తండాలో గుప్తనిధుల కొరకు పొలం యజమాని అనుమతి లేకుండానే బుధవారం రాత్రికి రాత్రి తవ్వకాలు చేపట్టి గుప్తనిధుల ఎత్తుకెళ్లినట్లు మండలంలో ప్రచారం సాగుతోంది. మండలంలోని చింతగడ్డ తండాకు చెందిన ఓ రైతు పొలంలో గుప్తనిధులు ఉన్నాయని, తవ్వకాలు చేపడితే చాలా డబ్బులు వస్తాయని నిత్యం వేధించేవాడని సమాచారం.

అదేమీ లేదు నా పొలంలో ఎటువంటి నిధులు లేవు తవ్వకాలు చేపట్టవద్దని నిరాకరించినట్లు తెలుస్తోంది. క్రమేపీ కొన్ని రోజుల గడిచాక గురువారం పొలం పనుల నిమిత్తం పొలం వద్దకు యాజమాని వెళ్ళగా తన పొలంలో పెద్ద ఎత్తున గుంత తీసి ఉన్నట్లు గమనించాడు. జేసీబీతో తవ్వకాలు చేపట్టినట్లు గమనించిన యజమాని అవాక్కయ్యాడు. పొలం యజమాని తన అనుమతి లేకుండానే తవ్వకాలు చేపట్టినట్లు చెబుతున్నాడు. విషయం తెలుసుకున్న కొత్తగూడ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed