రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నాడు: భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి

by Disha Web Desk 9 |
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నాడు: భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి
X

దిశ, ఇబ్రహీంపట్నం: పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్ షోలో స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదలకు ఇల్లు కట్టించే బాధ్యత మేం తీసుకుంటామన్నారు. నాతోపాటు మన సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తోడుగా ఉంటాడని, ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా కచ్చితంగా నెరవేరుస్తామని, ప్రధానంగా ఈ ప్రాంతంలో డ్రైనేజీ రోడ్లు సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయని, వాటి పరిష్కారానికి కచ్చితంగా కృషి చేస్తామని అన్నారు.

500 కోట్లతో తుర్కయంజాల మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ మహానగరం లాగా అన్ని అంగులతో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మీ కష్టాలను మా కష్టాలుగా భావించి వాటి సమస్యలకు పరిష్కారం చేస్తాం.. కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడే పార్టీ అని వెల్లడించారు. పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ సిగ్గు లేకుండా మళ్లీ ఓట్లు అడుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు నిధులు నియామకాలు కావాలని తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే అవేమీ పట్టించుకోకుండా కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు. ఈనెల 13న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాల్సిందిగా కోరుతున్నానని అన్నారు.

భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ కి కమిషన్ల మీద ఉన్న చిత్తశుద్ధి ప్రజాపాలన మీద లేదు ప్రాజెక్టుల పేరుతో ధరణి పేరుతో పేద ప్రజలను దోపిడీ చేశాడని, గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో మోడీ ప్రభుత్వాలు ప్రజాపాలనను ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేశాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనను ప్రారదోలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రంలో కూడా మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి అంతే ఇండియా కూటమి విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యేగా మల్ రెడ్డి రంగారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారు. నన్ను ఎంపీగా గెలిస్తే రెండు కాడెడ్ల లాగా బండి ముందుకు సాగుతుంది అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశలవారీగా కచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు 15లోగా కచ్చితంగా రుణమాఫీ చేస్తామని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఆశీర్వదించండని, ఈనెల 13న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండని ప్రజల్ని కోరాడు. అభివృద్ధి కోసం కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అనురాధ రెడ్డి, మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు కొత్త కుర్మ మంగమ్మ శివ కుమార్, డిసిసిబి అధ్యక్షులు కొత్త కుర్మ సత్తయ్య, సీపీఐ నాయకులు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ సైదయ్య బాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed