మూడ్రోజుల్లో MP ఎన్నికలు.. నిరుద్యోగులకు రాహుల్ గాంధీ భారీ గుడ్‌న్యూస్

by Disha Web Desk 9 |
మూడ్రోజుల్లో MP ఎన్నికలు.. నిరుద్యోగులకు రాహుల్ గాంధీ భారీ గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారీ గుడ్‌న్యూస్ అందించారు. ఇవాళ మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో నిర్వహించిన జనజాతర సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు 15 నాటికి ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తోన్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజల్ని వేడుకున్నారు. మీ సమస్యల పట్ల మీరు అవగాహనతో ఉండండని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. అలాగే రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. దళితులు, ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కులగణనతో పేదలకు న్యాయం చేస్తామని వెల్లడించారు. ప్రతి పేద కుటుంబంలోని మహిళ బ్యాంక్ ఖాతాలో ఏడాదిలో రూ. లక్ష వేస్తామని హామీ ఇచ్చారు. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని ప్రచారం జరుగుతోందని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని టచ్ చేసే శక్తి ఎవరికీ లేదని అన్నారు. అద్భుతమైన మెజారిటీతో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.

Next Story

Most Viewed