చేనేత సహకార సంఘం స్థలం కబ్జా

by Disha Web Desk 12 |
చేనేత సహకార సంఘం స్థలం కబ్జా
X

దిశ, మునుగోడు: చేనేత సహకార సంఘం బలోపేతానికి సహకరిస్తారని నమ్మి అధ్యక్ష కార్యదర్శులను నియమించుకుంటే చేనేత కార్మికులకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కాపుల దారులే కబ్జా చేసిన సంఘటన మండలంలోని మునుగోడు గ్రామపంచాయతీ పరిధిలో జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. మండలంలోని మునుగోడు, పలివెల, కొరటికల్, ఊకొండి, కొండాపురం గ్రామంలోని చేనేత సహకార సంఘం కు చెందిన చేనేత కార్మికులకు వృత్తి, నైపుణ్యత పెంచుకోవడం తో పాటు వాళ్లు తయారు చేసిన వస్త్రాలు విక్రయించు కోవడానికి మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట 20 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం జరిగింది.

ఆ భూమిలో 10 గుంటల భూమిని చేనేత కార్మికులకు తెలియకుండా సంఘం సభ్యులు లేని నేత బజార్ వీవర్స్ అసోసియేషన్ పేరా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గ్రామపంచాయతీలో అట్టి స్థలాన్ని నమోదు చేసుకోవడం జరిగిందని ఆరోపించారు. బోగస్ సొసైటీ పేరుతో చేనేత కార్మికులను మోసం చేస్తూ 10 గుంటల స్థలాన్ని గ్రామపంచాయితీలో నమోదు చేశారని అట్టి బోగస్ సొసైటీని రద్దుచేసి, గ్రామ పంచాయతీలో ఉన్న పేరును తొలగించి, చేనేత కార్మికుల సొసైటీ పేరు మీద చేయాలని కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్‌కు చేనేత కార్మికులు వినతిపత్రం అందించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జిల్లా చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు సింగం శివయ్య, మండల కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సైదులు, సంఘం సభ్యులు చిలుకూరి మధు, సింగం కృష్ణయ్య, సామల యాదగిరి, తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed