రాహుల్ ప్రధాని అయ్యేది లేదు.. ఇక్కడ హామీలు నెరవేర్చేది లేదు : ఈటల

by Disha Web Desk 23 |
రాహుల్ ప్రధాని అయ్యేది లేదు.. ఇక్కడ హామీలు నెరవేర్చేది లేదు :  ఈటల
X

దిశ, మేడ్చల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు పరచాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అమలు చేస్తాను అన్న రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదని, రాహుల్ గాంధీ ప్రధాని కూడా అయ్యేది లేదని ఇక్కడ హామీలు నెరవేర్చేది కూడా ఉండదని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం తోపాటుగా పేదల సొంత ఇంటి కలను నెరవేర్చే బాధ్యత తనదని ఈ సందర్భంగా తెలియజేశారు.

వీరభద్ర సంఘం ఆత్మీయ సమ్మేళనంలో..

ఉప్పల్ నియోజకవర్గం జవహర్ నగర్ లో ఉన్న బాలాజీ నగర్ లో నిర్వహించిన వీరభద్ర సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్ ఎత్తివేసిన రోజు మంత్రిగా ఉండి కూడా సంఘాలు ఉంటాయి సమస్యల కోసం కొట్లాడతాయి అని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలియజేసిన పట్టించుకోలేదని రాజేందర్ పేర్కొన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నడు అసెంబ్లీ ముఖం చూడని కులాలను పిలిచి అసెంబ్లీ వేదికగా సమావేశాలు పెట్టి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినవాడినని తెలిపారు. పేద వర్గాల సమస్యలు తెలిసిన వాడినని.. కేంద్రంలో కూడా పేదరికం నుండి వచ్చిన బీసీ బిడ్డ ప్రధానమంత్రిగా ఉన్నారని, మీ సమస్యలకు పరిష్కారం చూపించగలిగే సత్తా ఉన్న పార్టీ ఒక్క బీజేపీ మాత్రమే అని తెలిపారు. ఈ సమావేశంలో వీరభద్ర సంఘం ప్రతినిధులు వీరాస్వామి, యాదగిరి, కర్రిసురేందర్ పాల్గొన్నారు.

రామంతపూర్ లో ..

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతపూర్ లో జరిగిన సబ్బండ వర్గాల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ కులాలతో మతాలతో పార్టీలతో ప్రాంతాలతో జెండాలతో సంబంధం లేకుండా భారతదేశంలో మళ్ళీ మోదీ ప్రధానిగా ఉండాలని ఇది ప్రజల ఎజెండా అని, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనేది యావత్ ప్రజల నినాదంగా ఉండదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఈ దఫా ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం కలగదని తెలిపారు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, వివిధ సంఘాల నేతలు కృష్ణయ్య సాయికిరణ్ పాండు శ్రీవాణి వెంకట్రావు గోపాల్ మల్లేష్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనంలో..

మూసీ నదిని ప్రక్షాళన చేయించే బాధ్యత తనదని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చిన ప్రక్షాళన చేపిస్తానని ఈటెల రాజేందర్ రామంతపూర్ లో జరిగిన కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనంలో తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే హామీలు నెరవేరుస్తా అంటు రేవంత్ రెడ్డికి చెబుతున్నారని అసలు రాహుల్ ప్రధాని అయ్యేదే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద జీతాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవని రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగాలంటే అది కేంద్రం తోని సాధ్యమవుతుందని అన్నారు. అతి తక్కువ సమయంలోనే అన్ని వర్గాల ప్రజలు మద్దతు దొరకడం ఎంతో సంతోషం కలిగిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

తూంకుంటలో మాదిగల మద్దతు..

కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఓక సీటు ఇవ్వలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద క్రిష్ణ మాదిగ అన్నారు. కాంగ్రెస్ మాదిగల పొట్ట కొడుతుంటే బిజెపి మన ఆకలి బాధను తీరుస్తుందని అన్నారు. తుంకుంటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో జరిగిన సభలో ఈటల తో పాటు క్రిష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎప్ అనుబంధ సంఘాలు బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మంద క్రిష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఏబీసీడీ వర్గీకరణ చేస్తానని ప్రామిస్ చేసింది నరేంద్ర మోదీ అయితే.. మోసం చేసింది మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అని ఆరోపించారు. ఈటల రాజేందర్ మీద పోటీకి కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్డిని, బీఆర్ఎస్ మరో రెడ్డిని పెట్టిందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం ఏకమై రాజేందర్ ని గెలిపించుకుందామని పిలుపు నిచ్చారు.17 స్థానాల్లో ఇద్దరికి మాత్రమే బీసీలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చిందని, అదే రెడ్డి వర్గానికి 7 టికెట్లు ఇచ్చిందని మండిపడ్డారు. 50 శాతం ఉన్న బీసీ కులాల కు రెండు టికెట్లు ఏడు శాతం ఉన్న రెడ్డిలకు 7 టికెట్లు ఇచ్చుకోవడం శోచనీయమన్నారు.బీసీ ఎస్సీ ఎస్టీలకు మద్దతుగా ఉన్న పార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని, అందుకే మా మద్దతు బీజేపీకేనని మంద క్రిష్ణ మాదిగ స్పష్టంచేశారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అనేక సామాజిక ఉద్యమాలను భుజాన వేసుకున్న నాయకుడు మందకృష్ణ మాదిగ అని కొనియాడారు.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఓటు బ్యాంకులుగా వాడుకుంది తప్ప ఏ రోజు కూడా ఆ జాతుల ప్రయోజనం కోసం పనిచేయలేదని మండిపడ్డారు.బీసీలకు టికెట్లు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మోసం చేసినట్లు తెలిపారు.

దివ్యాంగుల సంపూర్ణ మద్దతు..

పార్లమెంటు ఎన్నికల్లో దివ్యాంగులు సంపూర్ణ మద్దతు తెలపడం శుభపరిణామమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు దివ్యాంగులకు 6 000 రూపాయల పెన్షన్ ఇస్తానన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో పరిచయం లేని సంఘం అంటూ లేదని ఎవరు ఎక్కడ టెంట్ వేసి పోరాటం చేసిన నేను వెళ్లి మద్దతు తెలిపానని అన్నారు. మంత్రి అయ్యాక 78 కుల సంఘాలకు ఆత్మగౌరవభవనాలు కట్టించడానికి శ్రీకారం చుట్టింది తానేననన్నారు.


మల్కాజ్ గిరిలో తమిళియన్‌ల మద్దతు..

మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో నివాసముంటున్న తమిళియన్లతో బుధవారం సాయంత్రం ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తమ మద్దతు ఈటలకు ఉంటుందని తమిళియన్లు హామీ ఇచ్చారు. ముఖ్య అతిథిగా బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ హాజరయ్యారు.


జీడిమెట్లలో బీమా ఫ్రైడ్ వాసులతో..

నేను శ్రమను ధర్మాన్ని నమ్ముకున్న వాన్ని అని ఈటల రాజేందర్ అన్నారు.బుధవారం జీడిమెట్లలోని బీమా ఫ్రైడ్ వాసులతో సమావేశమయ్యారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాజకీయ నాయకుడు పైరవి కారుడు, రియల్ ఏస్టేట్ వ్యాపారి కాదు. మంచి ప్రణాళిక అందించేవాడు కావాలన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed