కాంగ్రెస్ పార్టీని ఉగ్ర సంస్థలు బలపరుస్తున్నాయి : ధర్మపురి అరవింద్

by Disha Web Desk 23 |
కాంగ్రెస్ పార్టీని ఉగ్ర సంస్థలు బలపరుస్తున్నాయి : ధర్మపురి అరవింద్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఉగ్ర సంస్థలు బలపరుస్తున్నాయని నిజామాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం సాయంత్రం జగిత్యాల పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు. జీవన్ రెడ్డి యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకం అని ఆయనతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. జీవన్ రెడ్డి హిందువులకు తాను వ్యతిరేకమని ఒప్పుకోకనే ఒప్పుకున్నాడని విమర్శించారు. జీవన్ రెడ్డి ముస్లింల కోసం కొట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి హిందూ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యం గా చేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు.

మరోవైపు సిమి, పీఎఫ్ఐ లాంటి ఉగ్రవాద సంస్థలకు జగిత్యాలను అడ్డా గా మార్చారని బెంగళూరులో జరిగిన బాంబు దాడికి జగిత్యాలకు సంబంధం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. జహంగీర్ మనవడు గాంధీ ఎలా అవుతాడంటూ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ మాట్లాడారు.చెరకు ఫ్యాక్టరీలు తెరిపిస్తామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ ఫ్యాక్టరీలను ఎంతకు అమ్ముతారో చెబితే కొనుగోలు చేసి తెరిపిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల దేశంలో అత్యంత ముఖ్యమైనవని కాబట్టి ప్రజలు ఆలోచించి బిజెపికి ఓటేయాలని కోరారు.ఈ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పై నిప్పులు జరిగారు. ఆరు గ్యారంటీ ల పేరుతో ప్రజల తో ఓట్లు వేయించుకొని మోసం చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణ రావు పాల్గొన్నారు.

Next Story

Most Viewed