నేను హైదరాబాద్ లో ఉన్న నా మనసు మాత్రం మంథని లోనే ఉంటుంది : దుద్దిళ్ల శ్రీధర్ బాబు

by Disha Web Desk 11 |
నేను హైదరాబాద్ లో ఉన్న నా మనసు మాత్రం మంథని లోనే ఉంటుంది : దుద్దిళ్ల శ్రీధర్ బాబు
X

దిశ, మంథని : నేను హైదరాబాద్ లో ఉన్న నా మనసు మాత్రం మంథని లోనే ఉంటుందని ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీపాద కాలనీలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబును శ్రీపాద కాలనీ వాసులు గజమాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో లైన్ గడ్డ,గౌడ్స్ వీధి సుభాష్ నగర్,మసీదు వాడ, మంథని మండలం సూరయ్య పల్లె,ధర్మారం,పుట్టపాక,రామయ్య పల్లె,సిద్ధపల్లి,ధర్మారం, గోపాల్పూర్, సింగరేడ్డి పల్లె గ్రామాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మాట్లాడుతూ… పుట్టిన మూడు నెలలకే ఏ పసిపాప అయినా నడుస్తదా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. గాలికి కూలిపోయే వంతెనలను,కృంగిపోయే ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందని విమర్శిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు తీసుకుందని, ఈ అప్పుతో రాష్ట్రం అతలాకులమవుతుందని అన్నారు.

మంథని ప్రాంతానికి ఒక చుక్క నీరు కూడా ఇవ్వకుండా లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన లక్ష కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాలు చేపట్టవచ్చుని తెలిపారు. గాలి దుమారం వస్తే బ్రిడ్జిలు కూలిపోతాయా అని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అన్ని పథకాలు అమలు చేస్తాం,పేద ప్రజల ముఖాల్లో ఆనందం చిరునవ్వులు చూడడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story

Most Viewed