BREAKING: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ గాడిద గుడ్డు ఇచ్చింది: సీఎం రేవంత్‌పై బండి సంజయ్ సెటైర్లు

by Disha Web Desk 1 |
BREAKING: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ గాడిద గుడ్డు ఇచ్చింది: సీఎం రేవంత్‌పై బండి సంజయ్ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ గాడిద గుడ్డు ఇచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డిపై బండి సంజయ్ సెటైర్లు వేశారు. ఇవాళ ఆయన కరీంనగర్‌లో మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు పట్టుకుని తిరుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.. కానీ తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ ఇచ్చిందే గాడిద గుడ్డు అని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ గాడిదగుడ్డు ఇచ్చిందని విమర్శించారు. తెలంగాణ మహిళలకు కాంగ్రెస్‌ పార్టీ గాడిద గుడ్డు ఇచ్చిందని అన్నారు. ఆరు గ్యారెంటీలతో మోసగించిన దొంగల బ్యాచ్‌ కాంగ్రెస్‌ అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నాని ఆరోపించారు.

Next Story

Most Viewed